-పోటీ చేస్తే పార్టీ అభ్యర్థిగా దిలీప్ చక్రవర్తి
అమరావతి ముచ్చట్లు:
ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా?లేదా? అన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్ణయించనున్నారు. నామినేషన్ల దాఖలుకు గడువు మంగళవారంతో ముగుస్తోంది. ఒక వేళ తెదేపా పోటీ చేయాలని నిర్ణయిస్తే ఆ పార్టీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తిని బరిలోకి దించనున్నారు.పోటీకి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో తెదేపా అభ్యర్థులుగా మొదట్లో ముగ్గురు, నలుగురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్ తదితరుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వంపైనే పార్టీ మొగ్గు చూపుతోంది.విశాఖ జిల్లా నేతలూ ఆయన పేరునే చంద్రబాబుకు నివేదిక రూపంలో పంపించారు. దాంతో తెదేపా పోటీ చేస్తేగనుక ఆయనే అభ్యర్థి కానున్నారు. ఇటీవల ఎన్నికల్లో దిలీప్ తెదేపా నుంచి అనకాపల్లి లోక్‌సభ టికెట్ ఆశించారు. కానీ భాజపాతో పొత్తులో భాగంగా అనకాపల్లి టికెట్ ఆ పార్టీకి కేటాయించాల్సి రావడంతో దిలీప్ చక్రవర్తికి అవకాశం దక్కలేదు.
Tags:Decision on TDP contest in MLC election today