ఏపీలో పాఠశాలలకు సెలవుల పోడిగింపుపై రేపు నిర్ణయం?
అమరావతి ముచ్చట్లు:
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణల పాఠశాలలకు ఈనెల 30 వరకూ సెలవులు పొడిగించడంతో.. ఏపీలో పాఠశాలలకు సెలవులు పోడిగింపుపై విద్యాశాఖలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో కరోనా పాజిటివ్ రేట్ ఇప్పటికే 13.87 శాతానికి చేరడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధుల ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. వారికి ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికానందున పాఠశాలలు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు తర్జన బర్జన పడుతున్నారు. ఒకవేళ పాఠశాలలు కొనసాగిస్తే ఎక్కడైనా కేసులు వెలుగు చూస్తే ఏం చేయాలనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Decision tomorrow on holiday extension to schools in AP?