స్పందనకు తగ్గిన వినతులు

Decreased auditory response

– కమిషనర్‌ వర్మ

Date:19/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి వినతులు తగ్గిందని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో ఆర్‌వో రామకృష్ణ కలసి స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 72 మంది తమ వినతిపత్రాలను అందజేశారు. ఇందులో 42 మంది పెన్షన్ల కోసం , 28 మంది ఇండ్లు కావాలని, ఒకరు రేషన్‌కార్డు కోసం , ఒకరువీధి దీపాలు వెలిగించాలని ఫిర్యాదు చేశారు. అలాగే మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు , ఈవోఆర్‌డి వరప్రసాద్‌ కలసి వినతులు స్వీకరించారు. అలాగే తహశీల్ధార్‌ కార్యాలయంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు వినతిపత్రాలు స్వీకరించారు. పెన్షన్లు, పాసుపుస్తకాలు, గృహనిర్మాణాలు, భూమి సర్వేలపై ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటిలో ఇప్పటి వరకు 1258 మంది వినతిపత్రాలు స్పందన కార్యక్రమం ద్వారా అందినట్లు తెలిపారు. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ప్రజలకు రశీదులు అందజేస్తూ పరిష్కరిస్తున్నామన్నారు.

ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం

Tags: Decreased auditory response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *