Corona cases crossed 94 lakhs in the country

దేశంలో తగ్గుముఖం పట్టిన కొవిడ్‌ కేసులు

Date:01/12/2020

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

దేశంలో కొవిడ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా 40వేలకుపైగా పాజిటివ్‌ నమోదు అవుతుండగా.. తాజాగా గడిచిన 24గంటల్లో 31,118 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా రికార్డయిన కేసులతో మొత్తం 94.62లక్షలు దాటాయని చెప్పింది. తాజా అంటువ్యాధుల సంఖ్య నిన్నటిలో పోలిస్తే దాదాపు 20 శాతం తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 482 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,37,621కు పెరిగింది. కొత్తగా 41,985 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 88,89,585 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,35,603 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.

ప్రజలందరూ ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: డీజీపీ

Tags: Decreased Kovid‌ cases in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *