ఆగివున్న లారీని డీ కొన్న కారు.ఒకరు మృతి,ఆరుగురికి గాయాలు

చిత్తూరు ముచ్చట్లు:


ఆగివున్న లారీని ఒక కారు  డీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నాయుడుపేట-పూతలపట్టు ప్రధాన రహదారిలోని టి. రంగంపేట క్రాస్ సమీపంలో చోటు చేసుకుంది. తిరుపతి నుండి బెంగళూరు కి వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో  గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. మృతురాలు  రామచంద్రపురం మండలం,దుర్గ సముద్రం కు చెందిన వరలక్ష్మి పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు కోదండరామిరెడ్డి, సుబ్రహ్మణ్యం లతోపాటు మరో నలుగురిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Dee bought a parked truck. One killed, six injured

Post Midle
Post Midle
Natyam ad