డీలా పడ్డ కోడి మాంస విక్రయాలు

Date:24/02/2020

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ నగరంలో కోడిమాంసం విక్రయాలు డీలా పడ్డాయి. వేటమాంసం కోసం ఎ గబడ్డారు. కరోనా వైరస్ ప్రభావం నుం డి కోడి మాంసం విక్రయాలు ఇంకా బయట పడలేదు. కేంద్ర పశు సంరక్షణ శాఖ మంత్రి, అధికారులు కోడి మాంసం హానికారం కాదని దాన్ని తిన డం వల్ల హాని జరగదని ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం లేద ని స్వయంగా ప్రకటించిన విషయం విదితమే. పై రెండు ప్రకటనలతో కోడి, వేట మాంసం దుకాణ యజమానులు ఈ ఆదివారం మాంసం విక్రయాలు ఊపందుకుంటాయని భావించారు. అయితే ఆదివారం వేట మాంసం విక్రయాలు గతంలో కంటే 50శాతం పెరిగాయని వేట మాంసం దుకాణ యజమానులు ఆనందంతో ఉన్నారు.

 

 

 

అయితే ఇదే సరైన సమయమని భావించిన వ్యాపారులు కిలోకి రూ.20 అదనంగా వసూలు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని పాతబస్తీలో కిలో వేట మాంసం రూ.680 అమ్ముతుండగా విద్యాధరపురం, భవానీపురం ప్రాంతాల్లో కిలో రూ. 700 ధరకి అమ్మారు. కోడి మాంసం దుకాణదారులు మాత్రం ఈ ఆదివారం కోడి మాంసం డీలా పడ్డారు. కరోనా ప్రభావం కోళ్లను వెంటాడుతునే ఉంది. కోడి మాంసం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని వ్యాపారులు గిలగిల్లాడారు. కోడి మాంసం కొనాలంటే భయం, వేట మాంసం తినాలంటే పెరిగిన ధరతో భయం ఈ రెంటినీ కాదనీ పలువురి చూపు చేపల వైపుకి మళ్లింది. దాంతో చేపల దుకాణాల వద్ద వినియోగదారుల ఎగబడ్డారు.

 

 

 

ముఖ్యంగా సితార సెంటర్‌లోని గొల్లపూడి బైపాస్ రోడ్డు పక్కన ఎట్‌కిన్‌సన్ స్కూల్ రూటులోని నాలుగు రోడ్ల కూడలి, అంబాపురంలోని పాముల కాలువ వద్ద చేపల వ్యాపారులు పండగ చేసుకున్నారు. వినియోగదారులు చేజారిపోకుండా కిలోకి రూ. 10 తగ్గించారు. గత ఆదివారం కిలో రూ. 160 అమ్మగా ఈ ఆదివారం కిలో రూ.150లకే అమ్ముతున్నామని సితార సెంటర్‌లోని చేపల వ్యాపారి దుర్గారావు తెలిపారు.

తిరుమల\|/సమాచారం 

Tags: Deela Poultry Meat Sales

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *