డీకే అరుణది ఆత్మవంచన

Deeper six-minded spirit

Deeper six-minded spirit

Date:13/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
నాకు కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టలేదు. మహబూబ్ నగర్ జిల్లా లో మూడు రోజులు పర్యటించిన కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. తెలంగాణ ఇచ్చామని చెప్పి కూడా 2014 లో కాంగ్రెస్ నేతలు మహబూబ్ నగర్ జిల్లాలో ఎందుకు ఓడిపోయారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. నేను ఎక్కడా ఉన్నా గెలిచాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కు చేస్తున్న ద్రోహం తోనే అప్పట్లో పార్టీ వీడి తెరాసలో చేరాను. మహబూబ్ నగర్ అభివృద్ధి తెలంగాణ ఉద్యమ గొప్పతనమే. .డీకే అరుణ కు రాజకీయ భిక్ష పెట్టిందే నేను. నేను అవినీతి పరుడినని అంటున్నల అరుణకు  సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. నాలుగు జన్మలెత్తినా నా పై అరుణ వేలెత్తి చూపలేరు. అరుణ భర్త భరతసింహా రెడ్డి పై   క్రిమినల్ కేసులు నమోదు కాలేదా అని ప్రశ్నించారు.
దొంగ తెలివి తేటలు అరుణ కుటుంబానికే ఉన్నాయి. నేను బ్యాంకు నుంచి నిబంధనల ప్రకారం అప్పు తీసుకున్నా. అది కట్టేశా. నేను పులి ని కాదు పిల్లి అన్నారు. అవును డీకే అరుణ కుటుంబం లాగా రక్త మాంసాలు రుచి చేసే పులిని మాత్రం కాదని అన్నారు.  .సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మూడు గంటల్లో రాజీనామా చేస్తే డీకే అరుణ లాంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మూడేళ్లయినా రాజీనామా చేయలేదు. తెలంగాణ ను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం లో డీకే అరుణ చివరి దాకా కొనసాగిందని అన్నారు. ఏమి చూసి కాంగ్రెస్ కు ఓటెయ్యాలి. అధికారం లోకి రావడానికి కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. యువత మీద కాంగ్రెస్ నేతలకు ఎక్కడ లేని ప్రేమ వస్తోంది. ఎవరూ కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు. డీకే అరుణ ది ఆత్మవంచన.
సిగ్గు తప్పిన బతుకు. పానగల్ జడ్పీటిసి గా డీకే అరుణ పోటీ చేయడానికి ఎవరూ కారకులో చిన్నారెడ్డి ,జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళను అడిగితే చెబుతారని అన్నారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ సభలు అట్టర్ ప్లాప్ షో లు గా మిగిలాయి. అవును. స్వయం కృషి తోనే నేను క్లర్క్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. ఈ ఎన్నికల్లోనూ కొల్లాపూర్ నుంచి గెలుస్తా. గద్వాల లో ఏ చెట్టు ,పుట్ట నడిగినా డీకే అరుణ కుటుంబం అక్రమ దందాల గురించి చెబుతాయి. .కెసిఆర్ ను దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ,టీడీపీ లు పొత్తు పెట్టుకుంటున్నాయని అయన విమర్శించారు.
కెసిఆర్ ఏ తప్పు చేశారని దించుతారు. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తో పొత్తు ను జిల్లా నేతలు వ్యతిరేకించకుండా సమర్దిస్తుండటం సిగ్గు చేటని అన్నారు. .పదవి కోసం కాంగ్రెస్ నేతలు ఏ గడ్డి నైనా కరుస్తారు. ఈ సారి కాంగ్రెస్ 20 సీట్లు కాదు కదా రెండు సీట్లు కూడా గెలవదని అన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ఎపుడో గోరీ కట్టారు .మరో నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ కు అధికారం కల్ల.
రేపు పొరపాటున మహాకూటమి అధికారం లోకి వస్తే చంద్రబాబు కనుసన్నల్లో పాలమూరు ప్రాజెక్టు ల నిర్మాణం ఆగిపోతుందని హెచ్చరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్ రెడ్డి లా తెరాస కు 20 సీట్లు రావు అని చెబుతున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తెరాస సాధించిన ఫలితాలే ఈ ఎన్నికల్లో పునరావృతం అవుతాయి. .కాంగ్రెస్ కు బలం ఉంటే టీడీపీ తో పొత్తు ఎందుకు. ఖచ్చితంగా తెరాస 100 సీట్లు గెలుస్తుందని అయన అన్నారు.
Tags:Deeper six-minded spirit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *