6 గంటలపాటు దీపికా ఇంటరాగేషన్

Date:26/09/2020

ముంబై ముచ్చట్లు:

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత  డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ ద‌ర్యాప్తు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సుశాంత్‌ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసి అనేక విష‌యాలు రాబ‌ట్టిన ఎన్సీబీ ప్ర‌స్తుతం ర‌కుల్‌, దీపికా, శ్ర‌ద్ధా, సారాల‌ను ప్ర‌శ్నిస్తుంది. శుక్ర‌వారం నాలుగు గంట‌ల పాటు ర‌కుల్‌ని విచారించగా, తానెప్పుడు డ్ర‌గ్స్ వాడ‌లేద‌ని ఈ విచార‌ణలో ర‌కుల్ పేర్కొంది.కొద్ది సేప‌టి క్రితం ఎన్సీబీ కార్యాల‌యానికి చేరుకున్న దీపికా, సారా, శ్ర‌ద్దాల‌ని ఎన్సీబీ విచారిస్తుంది. మేనేజ‌ర్‌ కరిష్మా ప్ర‌కాశ్‌తో  చాటింగ్ విష‌యంతో పాటు ప‌లు విష‌యాల‌పై దీపికాను ప్ర‌శ్నిస్తున్నారు అధికారులు. క‌రిష్మాతో త‌న‌కు సాధార‌ణ సంబంధాలు ఉన్నాయే త‌ప్ప డ్ర‌గ్స్ సంబంధాలు లేవ‌ని దీపికా చెప్పుకొచ్చింది. అయితే దీపికా స‌మాధాన‌లు సంతృప్తిగా లేవ‌ని ఎన్సీబీ చెబుతుంది.మ‌రో వైపు శ్ర‌ద్ధ‌ను మ‌రో ఎన్సీబీ బృందం ప్ర‌శ్నిస్తుండ‌గా, జ‌య‌సాహాతో చాటింగ్‌పై ఆరా తీస్తున్నారు. 2019లో క‌ర‌ణ్ జోహార్ ఇచ్చిన డ్ర‌గ్స్ పార్టీపై కూడా ఎన్సీబీ దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తుంది. అయితే త‌నెప్పుడు డ్ర‌గ్స్ స‌ప్లై చేయ‌లేద‌ని క‌ర‌ణ్ జోహార్ బుకాయించార‌ట‌. త్వ‌ర‌లో క‌రణ్ జోహార్ కు కూడా ఎన్సీబీ నోటీసులు పంప‌నున్న‌ట్టు తెలుస్తుంది.

జోరువానలో వృత్తి ధర్మాన్ని నిర్వహించిన కానిస్టేబుల్ కు సత్కారం

Tags: Deepika interrogation for 6 hours

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *