పరువు హత్యను రాజకీయం చేస్తున్నారు

విశాఖపట్నం ముచ్చట్లు:

తెలంగాణ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్యను ఉద్దేశపూర్వకంగానే బిజెపి పార్టీ ఒక మతానికి అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తోందని విశాఖలో మహిళా చేతన, ముస్లిం థింకర్ ఫారం ఆరోపించాయి.గతంలో కూడా అనేక పరువు హత్యలు జరిగిన గాని పట్టించుకోని కొన్ని పార్టీలు ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఈ ఘతకా నికి పాల్పడడంతో దీనికి రాజకీయ రంగు పులుముకున్న రని ఆరోపించా రు. ఆసీన్ సుల్తానా, నాగరాజులు తమకు ప్రాణహాని ఉందని పోలీసు లకు ఫిర్యాదు చేసిన పోలీసులు సరైన చర్య తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగిందని అన్నారు. ఈ సంఘటనను ఒక వర్గానికి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందుదామని అనుకున్న బిజెపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో పలు మహిళా సంఘాలు, వివిధ ముస్లిం సంఘాలు చెందిన నేతలు హాజరయ్యారు.

 

Tags:Defamation is being politicized

Post Midle
Post Midle
Natyam ad