Natyam ad

బాబు,కిరణ్‌, పవన్‌ లకు ఓటమి తప్పదు – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-రాయలసీమలో 52 స్థానాలు మాదే

– రేవంత్‌ చెప్పినట్లు కిరణ్‌ మాడానే

– నిరాశతోనే సీఎం జగన్‌పై విమర్శలు

Post Midle

– తిట్టడమే వారి పని

– ఇద్దరు సీఎంలుగా ఉండి ఏం చేశారు..?

– కుప్పం అభివృద్ధి మాతోనే

 

 

పుంగనూరు ముచ్చట్లు:

ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కుప్పంలో చంద్రబాబునాయుడు, రాజంపేటలో కిరణ్‌కుమార్‌రెడ్డి, పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ లకు ఓటమి తప్పదు. కేవలం నైరాశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపైన , తన కుటుంబపైన విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లిలో చెప్పినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి అదిఇది కానీ మాడా అంటు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి పార్టీ అభ్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి తో  కలసి నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి కరపత్రాలు పంపిణీ చేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గూడూరు సభలో ఉమ్మడి అభ్యర్థులు బాబు, కిరణ్‌, పవన్‌ లు ముఖ్యమంత్రి జగన్‌పైన, తన కుటుంబంపై విమర్శలు చేయడంపై మండి పడ్డారు. అభివృద్ధి చేస్తామని ప్రజల్లోకి వెళ్లకుండ తమను దూషించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

 

7 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా గెలిచి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు కుప్పంకు హంద్రీనీవా నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. కుప్పం స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారని , ప్రస్తుతం చంద్రబాబును ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాజంపేటలో సూట్‌కేస్‌తో వచ్చిన కిరణ్‌కు డిపాజిట్లు కూడ రావని స్పష్టం చేశారు. పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌కు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. రాయలసీమలో 52 స్థానాలు గెలుస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని, ఇంకను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి , ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండవ సారి జూన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చై ర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌  తదితరులు పాల్గొన్నారు.

Tags; Defeat for Babu, Kiran and Pawan is inevitable – Minister Peddireddy Ramachandra Reddy

 

Post Midle