మంత్రి సబిత ఒంటెద్దు పోకడతో మహేశ్వరంలో ఓటమి తప్పదు
బీఆర్ఎస్ నేత కొత్త మనోహర్ రెడ్డి
రంగారెడ్డి ముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న వరక వర్గ విభేదాలు నిన్న తీగల కృష్ణారెడ్డి,నేడు తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త మనోహర్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒంటెద్దు పోకడతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సబితా ఇంద్ర రెడ్డి అనుచరులకు,ఆమె కాళ్లు మొక్కిన వారికే దళిత బంధు ఇస్తున్నారని కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అన్ని ఓటమి తప్ప నియోజకవర్గంలో ఎక్కడ గెలుపులు లేవని అన్నారు. తీగల కృష్ణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ని బ్రష్టు పట్టించారని విమర్శించారు. ఉద్యమకారులను మంత్రి విస్మరించారు అని పార్టీ నాయకులకు నియోజకవర్గం లో జరుగుతున్న కార్యక్రమాలు కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం లో భాకబ్జాలు ఎక్కువ అయిపోయాయని ప్రతిపక్షాలు మంత్రి అనుచరులు,మంత్రి,మంత్రి కొడుకు పేరు ఉన్నట్టు ఆరోపిస్తున్నారని కొత్త మనోహర్ రెడ్డి అన్నారు. భూకబ్జా ఆరోపణలు పై మంత్రి ఇలాకాల లో మహేశ్వరం తాసిల్దార్ పై కేసు నమోదు కావడం ఇందుకు నిదర్శనం అని అన్నారు.
Tags;Defeat in Maheswaram is inevitable with Minister Sabita’s camel trend
