Natyam ad

పుంగనూరులో 12న జాతీయ లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

జాతీయ లోక్‌ అదాలత్‌ను ఈనెల 12న కోర్టు ఆవరణంలో నిర్వహిస్తున్నామని , ప్రతి ఒక్కరు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. సోమవారం ప్రిన్సిపల్‌ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సిందుతో కలసి న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ సివిల్‌, క్రిమినల్‌ కేసులతో పాటు మనోవర్తి కేసులను పరిష్కరిస్తామన్నారు. అలాగే లోక్‌ అదాలత్‌ పరిధిలో రాజీకి అనుకూలమైన కేసులను పరిష్కరిస్తామన్నారు. పోలీసులు, న్యాయవాదులు, అన్నిశాఖల అధికారులు సహకరించి, అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమైయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, సెక్రటరీ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Defeat the National Lok Adalat on 12th at Punganur

Post Midle