లోపభూయిష్టమైన ప్రభుత్వ ఆలోచనవిధానం

-ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలి
-నిరుద్యోగ భృతిపై స్పష్టతఇవ్వని ప్రభుత్వం
-నీళ్లు, నిధులు, నియామకాలేవని కేసీఆర్ కు సూటి ప్రశ్న…?
-ఆడబిడ్డల ఉసురుపోసుకుంటే బాగుపడవు
-కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
-ప్రభుత్వాల తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజం

జగిత్యాల ముచ్చట్లు:

 

 

ఉద్యమ అఖంక్షతో ఏర్పడ్డ తెలంగాణలో  నేడు నిరుద్యోగులు రోడ్డున పడ్డారని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం జగిత్యాలలో
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూరాష్ట్ర ఏర్పాటు నీళ్ళు నిధులు మన నియామకాలు మనకే అని భావన తో తెలంగణ రాష్టం ఏర్పడిందనితెలంగాణ రాష్ట్రo ఏర్పడి 7 సంవత్సల తర్వాత కూడా
సీమాంధ్ర నాయకులు మన నీళ్ళు దుర్వినియోగం చేస్తున్నా అడ్డుకోవడం లేదని ఇదేనా మనం సాధించుకున్న తెలంగాణ అని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు
లక్ష 7 వేల ఉద్యగాలు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో  ప్రకటించారని చెబుతూ  ఉద్యోగాల పేరుతో నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు.బిశ్వాల్ కమిటీ ఇచ్చిన పిఆర్సీసి నివేదిక ప్రకారం  రాష్ట్రంలో
లక్ష 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని  నివేదిక ఇచ్చిందని మరి ఉద్యోగాలు ఇస్తామన్నా కేసీఆర్ మాటలు ఎమ్మాయ్యాయని ప్రశ్నించారు.

 

 

 

 

 

నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలలో  పెడితే తెరాస 3016 వేల రూపాయలు ఇస్తామని చెప్పి నేటికీ మాట నిలుపుకోలేదని,నిరుద్యోభృతి పై
ఇప్పటికీ తెరాస ప్రభుత్వ స్పష్టత ఇవ్వడంలేదని దుయ్యబట్టారు.రాష్టం లో
30 లక్షల నిరోద్యోగులు ఉంటే సంత్సరానికి దాదాపు 10 వేల కోట్ల రూపాయలభారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని  వివరించారు.నిరుద్యోగ యువత ఆత్మబలిదానాల తో తెలంగాణ రాష్టం ఏర్పడిందని వారిని విస్మరించడం సరికాదన్నారు.జనవరిలో 2021 లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే  ముఖ్యమంత్రి కేసీఆర్  50 వెల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 6 నెలల గడిచిన 5 గురిని కూడా భర్తీ చేయలేదని జీవన్ రెడ్డి విమర్శించారు.మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా మంటున్నావ్  ఇది 6 నెలల క్రితమే ప్రకటించావ్, నోటిఫికేషన్ ఇచ్చి మాట నిలుపుకోవాలని సూచించారు.కరోనా సెకండ్ వేవ్ లో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా లక్షల మంది మృతి చెందారని,ఇక మూడవ వెవ్ అంటున్నారని ప్రభుత్వ మాత్రం థర్డ్ వావ్ ను కంట్రల్లో చేయడానికి ముందస్తు చర్యలు కనబడటం లేదని, వైద్య సిబ్బంది భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఒక్క కలం పోటుతో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అయితే,  అదే కలం పోటుతో ఇవాళ ఔట్ సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ లను తొలగించిన ఘనత కేసీఆర్ దని, ప్రజలకు ఉపయోగపడే విధమైన విధంగా నడుచుకోవాలని హితవు పలికారు.

 

 

 

 

కరోనా కష్టకాలంలో సేవలను అందించిన
1640 మంది నర్సింగ్ స్టాఫ్ ను ఒక్క కలం పొటుతో  ఆడబిడ్డలని చూడకుండా తొలగించి  రోడ్డున పడేశారణి వారి ఉసురు తగిలి బాగుపడవని చెప్పారు.
కరోనా ఉదృద్రిలో సేవలను అందించిన నర్సులను తీసేయడం బాధాకరమన్నారు.
వేల సంఖ్యలో నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని
కనీసం అడబిడ్డ కనికరం లేకుండా మగ పోలీసులతో లాటి ఛార్జ్ చేయిస్తావా అని ఇది నీకు న్యాయమని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జిల్లా కేంద్రంలలో వైరాలజీ ల్యాబులు డయాగ్నస్టిక్  సెంటర్లు నూతన ప్రారంభిస్తామని చెబుతూ అందులో  ల్యాబ్ టెక్టనిసిషన్ సిబ్బంది లేకపోవడంతో  జగిత్యాల లో ఉన్న వైరాలజీ ల్యాబ్ మూత పడిందని ఆరోపించారు.

 

 

 

 

ఉద్యమ ఆకాంక్షతో తెలంగాణ రాష్టం ఏర్పడింది కానీ ఈ రోజు నిరొద్యగలు రోడ్డున పడ్డారని,
సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి  రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయావో అప్పటివరకు నికు ఎన్నికలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని కేసీఆర్ కు సూచించారు.
ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేవరకు
నిరుద్యోగ భృతి ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
మానవ సేవ మాధవ సేవ అనే నర్సులను కొనసాగించాలని, కరోనా మూడవ వేవ్ కోసం ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను కాపాడాలని ప్రభుత్వాలకు ఎమ్మెల్సీ సూచించారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, నేహాల్, జున్ను రాజేందర్, మహిపాల్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Defective government thinking

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *