గూగుల్‌ పే లో పేమెంట్‌ హిస్టరీ డిలీట్‌ చేయాలా?

అమరావతి ముచ్చట్లు:

 

యూపీఐ పేమెంట్‌ యాప్‌ గూగుల్‌ పేలో హిస్టరీ డిలీట్‌ చేయాలనుకుంటున్నారా? మొబైల్‌లో సులువుగా ఇలా చేసేయండి.పేమెంట్‌ యాప్ గూగుల్‌ పే (Google pay) ద్వారా చేసే ప్రతి చెల్లింపు సమాచారం ఆ యాప్‌లో నమోదవుతుంది. అయితే ట్రాన్సాక్షన్‌ హిస్టరీలో ఓ లావాదేవీ కనిపించకుండా చేయాలని అనుకుంటే.. ఆ సదుపాయమూ ఉంది. అదెలా అంటే?

యాప్‌లో ఇలా..

♦️గూగుల్‌ పే యాప్‌లో ప్రొఫైల్‌పై ట్యాప్‌ చేసి ‘Settings’లోకి వెళ్లి ‘Privacy & Security’ క్లిక్‌ చేయాలి.

♦️అందులో ‘Data & Personalization’ ఆప్షన్‌ను ఎంచుకొని గూగుల్‌ అకౌంట్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.

♦️తర్వాత ‘Manage your Google pay experience’ పేజ్‌ని కిందకు స్క్రోల్‌ చేస్తే.. గూగుల్‌ పే లావాదేవీల హిస్టరీ కనిపిస్తుంది.

♦️ఆ జాబితాలో మీరు వద్దు అనుకున్న లావాదేవీని అక్కడి ఆప్షన్‌తో డిలీట్‌ చేయొచ్చు.

♦️కావాలంటే టైమ్‌ ఫ్రేమ్‌ను ఎంచుకొని ఆ డేటా మొత్తాన్నీ తొలగించొచ్చు. అలాగే హిస్టరీ మొత్తాన్ని డిలీట్‌ చేయొచ్చు.

 

Tags: Delete Payment History in Google Pay?

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *