మిన‌ల్‌ను కాదు.. ప‌ర్మిష‌న్ ఇవ్వండి ప్ర‌ధాని కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

సింగ‌పూర్‌లో జ‌ర‌గ‌నున్న ఓ స‌ద‌స్సుకు వెళ్లేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ల‌భించ‌డంలేదు. ఈ అంశంపై ఇవాళ కేజ్రీవాల్ స్పందించారు. తానేమీ క్రిమిన‌ల్‌ను కాదు అంటూ వ్యాఖ్యానించారు. సింగ‌పూర్‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ సిటీస్ స‌మ్మిట్‌కు రావాలంటూ కేజ్రీకి ఆహ్వానం అందింది. ఆ స‌ద‌స్సులో ఢిల్లీ మోడ‌ల్‌ను కేజ్రీవాల్ ప్ర‌జెంట్ చేయాల్సి ఉంది. కానీ సింగ‌పూర్ టూర్‌పై కేంద్రం నుంచి క్లియ‌రెన్స్ రావ‌డం లేద‌ని కేజ్రీ అన్నారు. ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీని కోరాను అని, నెల రోజుల నుంచి ఆ అనుమ‌తి కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఢిల్లీ సీఎం తెలిపారు. నేనేమీ క్రిమిన‌ల్‌ను కాదు, నేను సీఎంను, ఈ దేశ స్వేచ్ఛా పౌరుడిన‌ని, సింగ‌పూర్‌కు వెళ్ల‌కుండా అడ్డుకునే హ‌క్కు ప్ర‌భుత్వానికి లేద‌ని, కానీ రాజ‌కీయ కార‌ణాల‌తోనే త‌న‌ను అడ్డుకుంటున్నార‌ని కేజ్రీవాల్ ఆరోపించారు.

 

Tags: Delhi CM Kejriwal asks PM to give permission not Minal

Leave A Reply

Your email address will not be published.