ఇక….ఢిల్లీ డేర్ డెవిల్స్ కాదు…ఢిల్లీ కేపిటల్స్

Delhi Daredevils ... Delhi Capitals

Delhi Daredevils ... Delhi Capitals

Date:05/12/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు, లోగో మారాయి. ఎన్ని సీజన్లు మారినా లక్ కలిసి రాకపోవడంతో.. ఫ్రాంచైజీ పేరును యాజమాన్యం ఢిల్లీ కేపిటల్స్‌గా మార్చింది. తొలి రెండు సీజన్లలో
సెమీఫైనల్ చేరిన ఢిల్లీ జట్టు తర్వాతి సీజన్లలో పేలవ ప్రదర్శన చేసింది. గత సీజన్‌తోపాటు నాలుగుసార్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఆ జట్టు.. తర్వాత ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్‌కు
చేరింది. దీంతో పూర్తి ప్రక్షాళన చేయాలని భావించిన యాజమాన్యం ఆటగాళ్లతోపాటు.. పేరు, లోగో, డ్రెస్ కలర్ మార్చేసింది. ఇప్పటికే ఢిల్లీ కేపిట్సల్ పేరిట ఓ బాస్కెట్ బాల్ జట్టు కూడా ఉంది. 2019 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ పది మంది ఆటగాళ్లను వదులుకుంది. వీరిలో గ్లెన్ మ్యాక్స‌వెల్, జాసన్‌ రాయ్, మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. వచ్చే ఏడాది సన్‌రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. ఇప్పటికే జట్టులో పృథ్వీ షా, రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లు ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ కోచ్‌గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కొనసాగనుండగా, మహ్మద్ కైఫ్ అతడికి సహకరించనున్నాడు. డిసెంబర్ 18న ఐపీఎల్ వేలం ప్రక్రియను నిర్వహించనుండగా, ఆటగాళ్ల కొనుగోలు కోసం ఢిల్లీ రూ.25 కోట్లు వెచ్చించగలదు. దీంతో మంచి ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యం భావిస్తోంది.
Tags:Delhi Daredevils … Delhi Capitals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *