Date:22/02/2021
దిల్లీ ముచ్చట్లు:
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ సహా ఇతర నిందితులకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 12 లోగా బదులివ్వాలని వారిని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కాంగ్రెస్‌కు అందచేసిన రూ 90.25 కోట్ల రుణాల వసూళ్ల హక్కులను కేవలం రూ 50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కట్టబెట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు మోసపూరితంగా వ్యవహరించడంతో పాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రత్యేక న్యాయస్థానంలో భాజపా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: Delhi High Court issues notices to Sonia, Rahul