Date:26/11/2020
చండీఘర్ ముచ్చట్లు:
పంజాబ్ రైతులు.. ఛలో ఢిల్లీ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు .. ఢిల్లీ వైపుగా పయనం అయ్యారు. హర్యానాలోని అంబాలా వద్ద ఉన్న శంబూ బోర్డర్ దగ్గర పంజాబ్ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆందోళనకారులు.. పోలీసు బారికేడ్లను గగ్గర్ నదిలోకి తోసివేశారు. వాటర్ కెనాన్లతో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్ నుంచి వస్తున్న రైతులు.. అంతర్ రాష్ట్ర శంబూ బోర్డర్ వద్ద భారీ సంఖ్యలో గుమ్మిగూడారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఢిల్లీ వైపు రైతులు వెళ్లకుండా ఉండేందుకు.. హర్యానా పోలీసులు భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Tags: Delhi in the midst of Punjab farmers protesting against agricultural laws