Delhi people need to be protected

ఢిల్లీ ప్రజలకు రక్షణ కల్పించాలి

Date:27/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రియాంక గాంధి సంఘ అధ్యక్షుడు సజ్జాద్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని పట్టణంలోని ఇందిరా సర్కిల్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సజ్జాద్‌ మాట్లాడుతూ ఢిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తున్నామన్నారు. రాజధానిలో ఇలాంటి ఆరాచకాలు జరుగుతున్న తరుణంలో అమాయక ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి క్రేజివాల్‌ రాజీనామ చేయాలని, మృతుల కుటుంభాలకు ఒకొక్కరికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

3వేలకు చేరిన కోవిడ్ మృతులు

Tags: Delhi people need to be protected

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *