-ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని సీఎం ప్రకటించాలి
-రైతుల జీవితాలను” మోడీ ” కి తాకట్టు పెట్టిన కేసీఆర్
-రైతుల ఆగ్రహాన్ని గ్రహించి కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవాలి
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Date:27/01/2021
జగిత్యాల ముచ్చట్లు:
ఢిల్లీ తరహా పరిణామాలు రాష్ట్రంలో ఉత్పన్నం కాకుండా చూడాలంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలను యధావిధిగా కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్చేశారు.బుధవారం జగిత్యాలలో పట్టణంలోని
జీవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీమాట్లాడుతూ రెండు నెలలుగా కేంద్రం తీసుకువచ్చిన రైతువ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలని ఢిల్లీలో రైతులు ఆందోళన
చేస్తున్న కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి పోలీసుల రక్షణ వలయాన్ని ధాటి ఎర్రకోటపై జెండా ఎగురవేయడం రైతులు ఎంతటి ఆగ్రహంతో ఉన్నారో ప్రధాని మోడీ గమనించికళ్ళు తెరిచి పునః పరిశీలన చేసి చట్టాలను వెనక్కి తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. చట్టంలో ధాన్యానికి మద్దతు ధరకు రక్షణ కల్పించాలని రైతులు కోరుతుంటే ఏడాదిపాటు చట్టాలను నిలిపివేస్తామని చెప్పడం లోపాలున్నాయని
పరోక్షంగా ప్రభుత్వం ఒప్పుకున్నట్లేనని వివరించారు. రైతులపై విశ్వాసం ఉంటే మరోఎడాదిన్నర వెసులుబాటు కల్పించి ఈఅంశంపైనే పార్లమెంట్ ఎన్నికలకు వెల్లాలని జీవన్ రెడ్డి కేంద్రానికి సూచించారు. చట్టాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం
వ్యతిరేకించి ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడంలో మోడీ – కేసీఆర్ ల మధ్య జరిగిన రహస్యాఒప్పందం ఏమిటో బయటపెట్టాలన్నారు. కేసీఆర్ అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి రైతుల జీవితాలను మోడీ కు తాకట్టుపెట్టారని జీవన్ రెడ్డిమండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యధావిధిగా కొనసాగిస్తానని ముఖ్యమంత్రి ప్రకటన చేయాలనీ లేకుంటే రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. రైస్మిల్లర్లపై ఉన్న ప్రేమ పదోవంతు రైతులపై చూపిస్తే చాలన్నారు.
వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేస్తానన్నా కేసీఆర్ వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతుధరకు అండగానిలుస్తానని చెప్పకపోవడం రైతులపట్ల ఏపాటి ప్రేమవుందో అర్థమవుతుందన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే వ్యాపారాలు,పెట్టుబడిదారులు లాభపడి రైతులకు 2005 కంటే ముందున్న పరిస్థితులు పునరావృతం కానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రైస్ మిల్లర్లకు వెసులుబాటు కల్పిస్తున్న ప్రభుత్వం రైతుల పంటలకు మద్దతు ధర కల్పించడం, కేంద్రాలు
యధావిధిగా కొనసాగించేవిధంగా పునరాలోచన చేయాలనీ జీవన్ రెడ్డి పునరుద్గటీంచారు. ఢిల్లీ పరిణామాలపై కేసీఆర్ కళ్ళు తెరవాలని, రైతుల ఆగ్రహాన్ని ఎవరు ఆపలేరన్నారు. రైతుల ఆందోళనలపై ప్రపంచ దృష్టి ఉందని దీన్ని కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు గమనించాలని సూచించారు. పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని పత్రాలు రాసిచ్చి ఎన్నికల్లో గెలిచిన ఎంపీ అర్వింద్ మాట మార్చారని విమర్శించారు. పసుపుకు 15వేల గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే పసుపుబోర్డు ఏర్పాటు
చేయాలను డిమాండ్ చెశారు. కేంద్రం రైతులపై చేసిన దాడిని జీవన్ రెడ్డి ఖండించారు.
ఈనెల 30న రైతు సమస్యలపై అర్ముర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టామని, కార్యక్రమంను విజయవంతం చేయాలనీ కోరారు.ఈసమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ భాస్కర్ రెడ్డి,బండ శంకర్, గుంటి జగదీశ్వర్, కే.దుర్గయ్య, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, ఆనందరెడ్డి, నక్క జీవన్, జున్ను రాజేందర్, మరాఠి లక్ష్మీనారాయణ, గుండా మధు, మహేష్,
రాధాకిషన్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం
Tags: Delhi-style developments should not arise in the state