ఉద్దేశపూర్వకంగానే నోటీసులు

హైదరాబాద్  ముచ్చట్లు:
హెచ్‌సీఏ నోటీసులపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో 9 మంది ఉంటే.. ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడి.. తాము చెప్పిందే వేదంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో జరుగుతున్న… జరిగిన అవినీతిని అరికట్టడానికి సమర్థవంతమైన వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే…. ఆ ఐదుగురే తప్పు పట్టారన్నారు. కారణం… వాళ్ళ తప్పుడు పనులు, వాళ్ళ అవినీతి బయట పడుతుందనే అలా చేశారన్నారు. హెచ్‌సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.అడ్డుకోవాలని చూస్తున్న తనపై బురద చల్లుతున్నారన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కి కూడా ఆ అయిదుగురు హాజరవ్వడం లేదన్నారు. జాన్ మనోజ్, విజయానంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ…. ఈ ఐదుగురి పై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. వీళ్ళ అవినీతికి తాను అడ్డుపడుతున్నాననే… వీళ్లకు వీళ్ళు మీటింగ్ పెట్టుకుని నాకు నోటీసులు ఇచ్చారన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఇచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారని అజహర్ అన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Deliberate notices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *