తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా విమోచన వేడుకలు

Date:17/09/2019

హైద్రాబాద్  ముచ్చట్లు:

దేశ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో స్వచ్ఛ భారత్‌ చేసి రోగులకు బ్రెడ్‌, పండ్లు ఉచితంగా పంపిణీ చేశారు.. ఇల్లు, కుటుంబం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోదీనే అని అభినందించారు. వన్‌ నేషన్‌ వన్‌ ట్యాక్స్‌, వన్‌ నేషన్‌ వన్‌ గ్రిడ్‌లతో పాటు వన్‌ నేషన్‌ వన్‌ రాజ్యాంగాన్ని అమలు చేసి దేశ గతినే మార్చారని ప్రశంసించారు. 18 వేల గ్రామాల్లో కరెంటు, 80 శాతం స్టంట్ల ధరల తగ్గింపు వంటి చర్యలను మోదీ చేపట్టారని పేర్కొన్నారు.

 

 

 

ఈ రోజు మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణకు స్వేచ్చా స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇలా మూడూ కలిసి ఒకే రోజు రావడం శుభకరమన్నారు.  ప్రస్తుతం వైరల్‌ ఫీవర్‌ ప్రబలుతున్న దృష్ట్యా జిహెచ్‌ఎమ్‌సి వ్యర్థాలను తొలగించాలని కోరారు. డెంగీ జ్వరాల మీద రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్‌ బ్రాండ్ను మనం కాపాడుకోవాలని కిషన్‌ రెడ్డి ప్రజలకు సూచించారు.

 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో…తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి నివాసంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్‌ రెడ్డి ప్రసంగిస్తూ ప్రాధాన్యత గురించి తెలియని వారంటూ ఉండరు అని అన్నారు. ఆగష్టు 15, 1947 తర్వాత హైదరాబాద్‌ రాజరిక పాలనలో ఉండేదని గుర్తుచేశారు. అలాగే నాడు భారతదేశాన్ని అస్థిరత చేసే విధంగా బ్రిటీషు వాళ్లు  కుట్రలు ఉండేవని అన్నారు.

 

 

హైదరాబాద్‌ను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయడానిక చేసిన సాయుధ పోరాటాలు, ఏ కులానికో, మతానికో వ్యతిరేకం కాదని, కావాలనే కొన్ని రాజకీయ శక్తులు దీన్ని కులాల ప్రాతిపదికన విభజన చేసే కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఆనాడు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ సైనిక చర్య ద్వారా హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో కలిపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమం చివర్లో అమరులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు.

మైనింగ్ ఆదాయంలో భారీ పెరుగుదల

Tags: Deliverance celebrations across Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *