స్వైన్‌ప్లూ నివారణకు మందులు పంపిణీ

Delivery of drugs to prevent swine flu

Delivery of drugs to prevent swine flu

Date:10/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో స్వైన్‌ప్లూ సోకకుండ ప్రతి ఇంటికి హ్గమియో మందులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. లయన్స్క్లబ్‌ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, లయన్స్క్లబ్‌ పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ, మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ కలసి సంయుక్తంగా హ్గమియో మందులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మున్సిపల్‌ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు కలసి ఆయా వార్డు కౌన్సిలర్ల సహకారంతో మందులు పంపిణీని ఇంటింటా చేపట్టారు. అలాగే జ్వరము, దగ్గు, జలుబు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. పట్టణంలోని ప్రతి ఇంటికి మందులను పంపిణీ చేసి, స్వైన్‌ప్లూ సోకకుండ జాగ్రత్తలు తీసుకుంటామని లయన్స్క్లబ్‌ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం తెలిపారు. అలాగే పట్టణంలో జిల్లా మలేరియా అధికారి హుస్సేనమ్మ ఆధ్వర్యంలో స్వైన్‌ప్లూ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెహోబైల్‌ మలేరియా డెంగ్యూ క్లినిక్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ , వైద్యులు శరత్‌, నారాయణ, పవన్‌కుమార్‌, హరిప్రసాద్‌రెడ్డి, శానిటరి ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌, సభ్యులు అమరనాథ్‌, రవిచంద్రన్‌, రాజశేఖర్‌, ప్రసాద్‌రావు, దయాళన్‌, నాగార్జున, గజరాజు, ఖమ్రు తదితరులు పాల్గొన్నారు.

 

చంద్రన్నా …. మీమాల్‌ ఎక్కడన్నా…

Tags: Delivery of drugs to prevent swine flu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *