Delivery of free goods to every home is appreciated

ప్రతి ఇంటికీ ఉచిత సరుకులు పంపిణీ అభినందనీయం

— ధాతలసేవలను ప్రశంసించిన ఎంపీ రెడ్డెప్ప
— ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసి ఆదుకోవాలన్న పెద్దిరెడ్డి
— సరుకులు, కూరగాయలను పంపిణీ చేసిన నేతలు

Date:03/05/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని ప్రతి ఇంటికి ఉచితంగా ఆరు రకాల నిత్యవసర సరుకులతోపాటు పండ్లు పంపిణీ చేయడంలో దాతలు, ప్రజాప్రతినిధుల సేవలు అభినందనీయమని చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప,వైస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి లు కొనియాడారు. ఆదివారం లద్దిగంలో మాజీ సర్పంచ్‌ లక్ష్మిదేవమ్మ,కాంట్రాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి,కాటిపేరిలో మాజీ సర్పంచ్‌ కృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ వీరితోపాటు మండల వ్యాప్తంగా రూ.15 లక్షల వ్యయంతో సుమారు 40 టన్నుల సరుకులను జెడ్పిటీసీ ఎన్‌. దామోదరరాజు, ఎంపీటీసి,ఎంపీపీ అభ్యర్థి జి. రామ్మూర్తి,సహచరప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వారి నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి పేదలను ఆదుకొవడం ఆద్శమన్నారు. సేవా భావంతో కరోనా విపత్తు సమయంలో జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ప్రజాప్రతినిధులు సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమంచేపట్టడం జీవితంలో తీపి గుర్తుగా నిలిచిపోతుందని కొనియాడారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ల సూచనలమేరకు ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. కోవిడ్‌-19 నివారణకు ప్రభుత్వం ప్రకటిస్తున్న సూచనలను పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు,జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు,ఎంపీపీ అభ్యర్థి రామ్మూర్తి,మాజీ జెడ్పిటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ, సింగిల్‌విండో చైర్మన్‌ మునస్వామిరాజు, కాంట్రాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, బూత్‌ కమిటీ కన్వీనర్‌ పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Delivery of free goods to every home is appreciated
Delivery of free goods to every home is appreciated

కరోనా బస్సు వచ్చేసింది.. ప్రత్యేకతలివే..

Tags: Delivery of free goods to every home is appreciated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *