మండుతున్న ఎండలతో శీతల పానీయాలకు డిమాండ్

Coolers, fans,

Coolers, fans,

Date:15/03/2019
వరంగల్ ముచ్చట్లు:
ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ఇళ్లలో కూలర్లు, ఫ్యాన్లు, ఉన్నప్పటికీ వేడి గాలులు ఎక్కువగానే ఉంటున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందు కు కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఉన్నతశ్రేణి వర్గా లు ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కూలర్లు అందుబాటు ధరలకు లభిస్తుండటంతో నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. చల్లదనం కోసం శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు, జ్యూస్‌లు, నిమ్మరసాలు తీసుకుంటున్నారు. అలాగే ఉపాధిహామీ కూలీలతో పాటు ట్రాక్టర్లపై, పరిశ్రమల్లో, ఇటుక బట్టీలలో పనిచేసే కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద లు తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో పనిచేయాల్సి వస్తుంది. ఎండాకాలం ముందే వచ్చినట్లుగా పదిహేను రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తీవ్రత క్రమం గా పెరుగుతూ వస్తుంది. దీంతో చలి ప్రభావం కూ డా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉదయం 11 గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. వాహనాలపై ప్రయాణించే వారు ఎండ నుంచి రక్షణ పొందడానికి మాస్క్‌లు, టోపీలు ధరిస్తున్నారు. వేడి ప్రభావానికి ఉక్కపోతతో చెమటలు పట్టేస్తున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగత్ర నమోదవుతూ వ స్తుంది. ఈ నాటి వరకు ఇదే స్థాయిలో కని ష్ట ఊష్ణోగ్రత నమోదు అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మార్చిలోనే ఎండలు మండిపోతుంటే ఏప్రిల్, మే లలో ఎలా ఉంటాయోనని ఇప్పట్నుంచే ఆందోళలనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎప్రిల్‌లో ఉం డాల్సిన ఊష్ణోగ్రతలు మార్చి మొదటి వారంలోనే నమోదవుతున్నాయి. రాబోయే నెలల్లో ఎండలు ఇంతకు మించి ఉండవచ్చునని జంకుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఎండ వేడి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియక చాలామంది వ్యాధుల బారిన ప డుతుంటారు. అందుకే ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్యులు. ఎండాకాలంలో డయేరియా వస్తుంది. ఎండలో తిరగడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురై చాలామంది వడదెబ్బ బారిన పడతారు. పొలాల్లో పనిచేసేవారు. భవన నిర్మాణ రంగం కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, రహదారులపై వ్యాపారం చేసేవారు, టోపీలు, హెల్మెట్ వంటివి ధరించకుండా ప్రయాణం చేసేవారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండలో సాధ్యమైనంత వరకు తిరగొద్దు. తప్పదనుకుంటే తలపాగ లేదా టోపీ ధరించి పనిచేయాలి. వృద్ధులు, పిల్లలు ఎండలోకి వెళ్లినప్పు డు తప్పనిసరిగా గొడుగు వాడాలి. చెమట రూపం లో శరీరంలో ఉన్న నీరు బయటకు పోతుంది. కా బట్టి వీలైనంత ఎక్కువగా ఉప్పు కలిపిన ద్రవ ప దార్థాలను తీసుకోవాలి. సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. ఎండవేడి తట్టుకునేందుకు శరీరానికి చల్లదనాన్ని చేకూర్చే పండ్లు, పానీయాలు ఎంతో అవసరం. అవే మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తూ స్వాంతనిచ్చేందుకు మా ర్కెట్లో లభ్యమవుతున్నాయి. కొబ్బరి బొండాలు, ఖర్భుజాలు, దోసకాయలు దర్శనమిస్తుంటాయి. వీటికి ప్రత్యేక గిరాకీ ఉంటుంది. పగటిపూట సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా రాత్రివేళ చలి వణికిస్తుంది. పగటిపూట ఎండలు తీవ్రంగా మండుతుండగా రాత్రి ఊష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటమే దీనికి కా రణంగా తెలుస్తుంది. ఆకాశంలో మేఘాలు సహి తం తక్కువగా ఉండడంతో భూమి నుంచి వేడి పైకి వెళ్లిపోతుందని, దీంతో భూమి తొందరగా చ ల్లబడి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటుంది. దీంతో పగటి పూట ఎండ, రాత్రి వేళ చలివణుకుతో అల్లాడిపోతున్నారు.
Tags:Demand for soft drinks with blazing sunny

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *