ఉత్థానం మామిడికి డిమాండ్

శ్రీకాకుళం  ముచ్చట్లు :

వాతావరణం సహకరించడంతో ఉద్దానం ప్రాంతంలో మామిడికాయలు విరగకాశాయి. పైగా ఉద్దానం మామిడి రుచిగా ఉంటుండడంతో మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో రైతులు  స్థానిక వర్తకులు, దళారీలతో ముందస్తు ఒప్పందం ప్రకారం కాయలను బరంపురం రవాణా చేస్తున్నారు. ఉద్దానంలో పండే కొబ్బరి, మామిడి, పనస వంటి ఉద్యాన పంటలకు ప్రధాన మర్కెట్‌ ఒడిశా. కొన్ని దశాబ్దాలుగా ఇదే రీతిలో వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం లాక్‌డన్‌ కారణంగా ఒకపూట మాత్రమే లావాదేవీలకు ఆస్కారం ఉండడంతో వ్యాపారాలు పరిమితంగా సాగుతున్నాయి.ఒడిశా అంబోమార్కెట్‌కు రోజుకు 150 లోడులు టాటామ్యాక్సీ పికప్‌ వ్యానులలో ఉద్దానం నుంచి మామిడికాయలు వస్తున్నట్టు వర్తకులు చెబుతున్నారు. కలెక్టర్‌ రకం టన్ను రూ.8000, దేశవాళీ రకం టన్ను రూ.6000, బంగినపల్లి రకం టన్ను రూ.15,000 ధర పలుకుతోందని అంటున్నారు. రైతులు ఎవరైనా కాయలు కోసి తీసుకువస్తామంటే తామే వాహనం పంపిస్తామని, అన్‌లోడింగ్‌ అయినవెంటనే డబ్బులు చెల్లిస్తామని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఉద్దానంలో పంట కూడా ఇప్పుడేపక్వానికి వచ్చేదశలో ఉంది. నీలాల రకం ఇప్పటికీ లేత దశలోనే ఉన్నాయి. జగన్నాథ రథయాత్ర సమయానికి కోతకు వస్తాయి. మరో 10 రోజుల్లో అంబామావాస్యా (ఒడిశాలో పేరుగాంచిన పండుగ)కు పనస, మామిడిపళ్లను ఒడిశావాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో క్రమంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో పండి కొబ్బరి, మామిడి, పనస పంటలను ఒడిశా ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఉద్దానం పంటను ఒడిశావాసులు ఓ బ్రాండ్‌ ఇమేజ్‌గా భావిస్తారు. గత కొన్ని తరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Demand for uplifted mangoes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *