ప్రమాదంలో ప్రజాస్వామ్యం – కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మెన్ వివేక్ కె తన్ఖా  

 Date:15/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు
రాజకీయవేత్తలు అంటే ప్రజలకు సేవచేసేవాళ్ళు. వాళ్ళంటే సమాజంలో గౌరవం ఉంది. వాళ్ళు దాన్ని కాపాడుకునేలా వ్యవహరించాలి. ప్రస్తుత ఓటర్ లిస్టు పై అవగాహన కల్పించాలి, నకిలీ ఓట్లను గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ  లీగల్ సెల్ చైర్మన్ వివేక్ కుమార్ తన్ఖా అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నిజమైన ఓటర్ లు ఉండేలా చూడాలి.
అప్పుడే ఎన్నికలు సజావుగా సాగుతాయి. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మద్యప్రదేశ్ రాష్ట్రాల్లో అడ్వకేట్ ప్రొటెక్ట్ ఆక్ట్ ఉంది.ఈ ఆక్ట్ ను తెలంగాణలో పెట్టే విధంగా టీపీసీసీ తో మాట్లాడతాను. పార్లమెంట్ లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని అయన అన్నారు. అక్కడ బడా మోడీ. ఇక్కడ కెసిఆర్ చోటా మోడీ. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. లాయర్లు భాగస్వామ్యం అయితేనె ఈ మార్పు సాధ్యమవుతుందని అయన అన్నారు.
Tags:Democracy in Accident – Congress Legal Cell Chairmen Vivek K Tangha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *