మేలు జాతి విత్తన పొట్టేళ్ల ప్రదర్శన

Demonstration of good breed seed broods

Demonstration of good breed seed broods

Date:19/11/2019

పెద్దపంజాణి ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్బులో మేలుజాతి విత్తన పొట్టేళ్ల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. సోమల, చౌడేపల్లి, పెద్దపంజాణి మండలాల నుంచి రైతులు తమ పొట్టేళ్లతో పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో సుమారు 76 విత్తన పొట్టేళ్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతి ఏ. నారాయణప్ప (శివాడి), రెండవ బహుమతి డి. బాలయ్య (శివాడి), మూడవ బహుమతి టి. లక్ష్మన్న(చౌడేపల్లె)కు చెందిన రైతులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘ అధ్యక్షుడు ప్రకాష్ యాదవ్, మదనపల్లె ఉప సంచాలకుడు డాక్టర్ జె. రమేష్, చిత్తూరు, పుంగనూరు, సహాయ సంచాలకులు డాక్టర్ చిట్టిబాబు, డాక్టర్ పి. మనోహర్, పశువైద్యాధికారులు డాక్టర్ పి. ధనుంజయ రెడ్డి, డాక్టర్ సరిత, డాక్టర్ వెంకటముని నాయుడు, డాక్టర్ దినేష్, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

 

సింగపూర్ తో వ్యాపార వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం 

 

Tags:Demonstration of good breed seed broods

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *