అమరావతి ముచ్చట్లు:
పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే నాలుగైదు రోజు ల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందన్నారు. డెంగీకి కారణమయ్యే టైగర్ దోమ మంచి నీటిలో పెరిగి.. ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. దోమల నివారణకు పాఠశా లల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆఖరి నిమిషం వరకు ఆగొద్దు..
◆ పిల్లల్లో డెంగీతోపాటు మలేరియా, టైఫాయిడ్ తదితర జ్వరాలు పెరు గుతున్నాయి. ఆఖరి నిమిషంలో వైద్యులను సంప్రదించడంతో కొన్నిసార్లు పరిస్థితి విషమంగా మారుతోంది. పెద్దల్లోనూ ఇదే పరిస్థితి ఉంటోంది.
పిల్లలు/పెద్దలకు జ్వరం వస్తే పారాసిటమాల్ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదు. 24-48 గంటల్లో జ్వరం తగ్గ నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
◆ వర్షం కారణంగా తాగునీరు, ఆహారం కలుషితమవుతుంది. వీటివల్ల డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బాగా కాచి చల్లా ర్చిన నీళ్లతోపాటు వేడి వేడిగా ఆహారం తీసుకోవాలి. ఈ సీజన్లో పిల్ల లను బయటి ఆహారానికి దూరంగా ఉంచాలి.
◆ పిల్లలతోపాటు పెద్దల్లో 101 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, తీవ్రమైన తల నొప్పి, కళ్ల వెనుక నొప్పి, చలితో కూడిన జ్వరం, వాంతులు, ఊపిరి తీసు కోవడంలో ఇబ్బంది, తీవ్ర నీరసం, అలసట, రక్తంలో ఆక్సిజన్ తగ్గడం, బీపీ తగ్గిపోవడం, శరీర భాగాల నుంచి రక్తస్రావం కావడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
Tags:Dengue should be suspected if fever occurs