పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్, వికె డెంటల్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం 200 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. పట్టణంలోని ఈస్ట్పేట మున్సిపల్ స్కూల్‌లో వైద్యశిబిరం నిర్వహించారు. డాక్టర్లు విద్యాధర్, కావ్య లు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులకు టూత్‌పేస్ట్లు, బ్రెష్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు రమణ, లయన్స్ క్లబ్ ప్రతినిదులు మహేంద్రరావు, వరలక్ష్మీ, రఘుపతిరెడ్డి, కృష్ణమూర్తి, రాంకుమార్, అస్లాం, సురేష్, బాలసుబ్రమణ్యం, శ్రీకాంత్, మణికంఠ తో పాటు హెచ్‌ఎం నాగరాజు, స్కూల్ కమిటి చైర్మన్ శోభారాణి పాల్గొన్నారు.
Tags; Dental check-ups for 200 students by Lions Club