అధికార పార్టీకి చట్టాలు వర్తించవా 

Date:18/09/2020

అనపర్తి  ముచ్చట్లు

అధికార పార్టీకి  సెక్షన్144,సెక్షన్ 30  వర్తించదా అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్లారెడ్డి పోలీసు ఉన్నత అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి  రామవరంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ  పెదపూడి మండలం అచ్యుతపురంలో ఇళ్ళ స్థలాల దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించిన  నన్ను, పెదపూడి మండల టీడీపీ  నాయకులను జిల్లా వ్యాప్తంగా సెక్షన్144,సెక్షన్ 30 అమలులో ఉందని నిరసనలు,ధర్నాలు చేయరాదని పోలీసు ఉన్నత అధికారులు గృహ నిర్బంధం చేశారని తెలిపారు.
ఉదయం 6 గంటల నుండే పోలీస్ పికెట్ కొనసాగించారు.  విషయం తెలిసి సంఘీభావం తెలపడానికి వచ్చిన కార్యకర్తలను  పోలీసులు  అడ్డుకున్నారు.ఈ సమావేశంలో అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, సుబ్బారెడ్డి ఇతరులు  పాల్గోన్నారు.

 

 

డెత్స్ తక్కువగా చూపుతున్న ఆరోగ్య శాఖ

Tags:Department of Health showing low death toll

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *