Date:23/01/2021
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బురుడు గల్లీ కి చెందిన పలు పేద కుటుంబాలు మున్సిపల్ కార్యాలయంలో నిన్నటి నుంచి భైఠాయించారు.వారికి గతంలో కుబీర్ బైపాస్ రోడ్డు లో ఇండ్లు పోవడంతో బాధితులకు అప్పుడు నాయకులు అధికారులు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి కాళీ చేసి అద్దెకు వుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇండ్లు కట్టివ్వలేదని ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి రెండు పడక గదుల ఇండ్లు కట్టివ్వాలని మున్సిపల్ కార్యాలయంలో కూర్చున్నారు.వారికి ఇచ్చిన పట్టాలను చూపిస్తూ నిరసన తెలిపారు.తమకి సంబంధించిన అధికారులు హామీ ఇచ్చే వరకు ఎక్కడినుంచి కదిలేది లేదని మున్సిపల్ అధికారులను కూడా విధులకు రనివ్వమని గేటు వద్ద కూర్చున్నారు.బాధితురాలు మాట్లాడుతూ నిన్నటి నుంచి ధర్నా చేస్తున్న ఎవరు రాలేరని తమకి హామీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని అన్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: Deployment in the municipal office