కేథార్‌నాథ్ ఆలయం వెలుపల పూజారుల బైఠాయింపు

ఉత్తరాఖండ్‌ ముచ్చట్లు :

 

ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేథార్‌నాథ్ ఆలయం వెలుపల పూజారుల బైఠాయింపు మౌన నిరసన మూడోరోజైన ఆదివారంనాడు కూడా కొనసాగుతోంది.దేశస్థానం మేనేజిమెంట్ బోర్డును రద్దు చేయాలనే డిమాండ్‌పై పూజారులంతా ఈ నిరసన సాగిస్తున్నారు. ఉపవాస దీక్ష కూడా పాటిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేవస్థానం బోర్డును రద్దు చేయాలన్న తమ డిమాడ్ పరిష్కారం కాకుంటే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని కేదార్‌నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ మరోసారి స్పష్టం చేసింది.దేవస్థానం బోర్డు తమ హక్కులను హరిస్తోందని పురోహిత్ సమాజ్ తెలిపింది.ముఖ్యమంత్రి కాగానే సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చిన తీరథ్ సింగ్ రావత్ ఆ తర్వాత పట్టించుకోవడం లేదని, పైగా బోర్డును మరింత విస్తరిస్తుండటం సహించలేని విషయమని పేర్కొంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Deployment of priests outside the Ketharnath Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *