బీజేపీకి డిపాజిట్లు కుడా రావు-మంత్రి మాల్లారెడ్డి
మేడ్చల్ ముచ్చట్లు :
బీజేపీ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుందని, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాబోయే ఎన్నికలలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని, సీఎం కేసీఆర్ ముందు ఎవ్వరి ఆటలు సాగవన్నారు మంత్రి మల్లారెడ్డి. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తెలిపారు. మేడ్చెల్ జిల్లా పీర్జదిగుడా, బోడుప్పల్ కార్పొరేషన్ లలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. అభివృద్ధి లో పీర్జదిగుడా కార్పొరేషన్ ముందు వరుసలో ఉందన్నారు మంత్రి మల్లారెడ్డి.
Tags: Deposits will not be given to BJP – Minister Mallareddy