Deputy Chief Minister Bhumi Puja on August 3 at Subramanyaswamy Temple.

సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆగస్టు 3న ఉపముఖ్యమంత్రి భూమిపూజ.

Date:01/08/2020

కార్వేటినగరం ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్యంస్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగస్టు 3వ తేదీన భూమిపూజ చేయనున్నారు. ఆలయంలో రాజగోపురం, ప్రహరి, ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ వంటి పనులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి భూమి పూజ చేయనున్నట్టు ఆలయ ఇంచార్జ్ కార్యనిర్వహణాధికారి రవీంద్రరాజు చెప్పారు. ఈ పనుల కోసం సిజిఎఫ్ ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు అయినట్టు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల లోగా సుముహూర్త మందు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి భూమి పూజ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి రవీంద్ర రాజు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. స్థానికుల అభ్యర్థన మేరకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సుబ్రమణ్య స్వామి ఆలయ అభివృద్ధి పై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే సంబంధిత దేవాదాయ శాఖ ఇంజనీర్లతో గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రత్యేక చొరవ చూపడంతో నాలుగు నెలల క్రితమే 50 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఎట్టకేలకు ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి ముందడుగు పడింది. ఈ క్రమంలో కార్వేటినగరం సుబ్రమణ్య స్వామి ఆలయంలో రాజగోపురం, ప్రహరీ నిర్మాణం, రాతితో ఫ్లోరింగ్ వంటి పనులకు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి భూమి పూజ జరపడానికి సోమవారం ముహూర్తం ఖరారైంది.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి ,ఎమ్మెల్యే కు స్వాగతం పలికిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Deputy Chief Minister Bhumi Puja on August 3 at Subramanyaswamy Temple.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *