జగనన్న నవరత్నాలు ఒక యజ్ణ్మంలా  పేదలకు అందిస్తున్నారు– ఉప ముఖ్యమంత్రి

తిరుపతి ముచ్చట్లు:

 

జగనన్న  తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే  నాడు రైతుల అవస్థలు చూసి రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు ఇస్తే కొడుకుగా నేడు జగనన్న రెండడుగులు ముందుకు వేసి నవరత్నాలు ఒక యజ్ణ్మంలా  కులాలకు, మతాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నారని పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు.తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీనివాస ఆడిటోరియంలో బుధవారం ఉదయం జిల్లా వ్యవసాయ సలహా మండలి, నవరత్నాలు-పెదలందరికి ఇళ్ళు కార్యక్రమాలపై  సమీక్ష నిర్వహించగా  ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణ శాఖామంత్రి రంగనాథరాజు, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ , గృహనిర్మాణ శాఖ ఎం. డి. నారాయణ భరత్ గుప్తా, తిరుపతి నగరపాలక  కమిషనర్ గిరీషా, జాయింట్ కలెక్టర్ లు వెంకటేశ్వర, వీరబ్రహ్మం, రాజశేఖర్, పార్లమెంట్ సభ్యులు  గురుమూర్తి, రెడ్డెప్ప శాసనసభ్యులు  మధుసూధరెడ్డి ,కరుణాకరరెడ్డి, ఆదిమూలం, శ్రీనివాసులు, నవాజ్ బాషా,మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, ఆర్ డి ఓ లు చిత్తూరు  రేణుక, తిరుపతి కనక నరసారెడ్డి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, జిల్లాఅధికారులు పాల్గొన్నారు.

 

ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో యుగపురుషుడు రాజశేఖర రెడ్డి తనయుడు  జగనన్న ముఖ్యమంత్రిగా , గృహనిర్మాణ శాఖ మంత్రిగా  రంగనాధ రాజు , పంచాయితీ రాజ్ శాఖమంత్రిగా  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చిత్తశుద్దితో పేదల పక్షాన పనిచేస్తున్నారని అన్నారు. జగనన్న ఇప్పుడు  ఇస్తున్నదిజగనన్న  లేఔట్లు కాదని,  జగనన్న  పట్టణాలుగా రూపుదిద్దుకోబోతున్నాయని అన్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళు 10,600 పాడైతే అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి వెళితే చలనం లేదని ఇప్పుడా పరిస్తితి లేదు జగనన్నకాలనీలు అన్నీ సౌకర్యాలతో  పట్టణాలుగా రూపుదిద్దుకోబోతున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి కొబ్బరిచెట్లు అందించి కేరళ తరహా వాతావరణం తీసుకురానున్నామని అన్నారు.

 

 

 

గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ జగనన్న సుధీర్గ పాద యాత్రలో అక్కచెల్లెమ్మలు కాలువుల, చెరువుల గట్టున వుండటం చూసి ఇచ్చిన మాటమేరకు 35 వేల ఎకరాల భూసేకరణ చేసి 31 లక్షల ఇళ్ళు మంజూరు చేయగా , మొదటి విడతలో 17.60 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరుచేశారు,   ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. రాష్ట్రంలో 17,005 కొత్త గ్రామాలుగా జగనన్న కాలనీలు రానున్నాయి అన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి స్వయంగా శ్రీకాళహస్తి వద్ద 17 వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా యంత్రాగం  కృషితో జిల్లాలో  ఇళ్ల నిర్మాణాల పునాధుల్లో రెండవ స్థానంలో వుందని అన్నారు. ముఖ్యమంత్రి  సంక్షేమం విషయంలో పేదలు కంప్యూటర్ బటన్ నొక్కి ఒక లక్ష కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు చేర్చారు.

 

 

 

 

అన్నారు. ఇక ఇళ్ల విషయంలో పేదవాడికి స్థిరాస్తిగా , డాక్యుమెంట్ రూపంలో ఇవ్వాలని అనుకున్నారు, ఒక్కొక్క చోట దీని విలువ రూ 17 లక్షల వరకు వుందని అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్  వుంది, సిమెంట్ , ఇసుక అందుబాటులో వుంది, నిర్మాణాలకు నీటిని అందిస్తున్నాము తెలిపారు.  ముఖ్యమంత్రి ఒకటే అన్నారు, మంజూరు అయిన ఇళ్ళలో ఒక్కటి కూడా కట్ట కుండా ఆగరాదని  ఆదేశించారని అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలతో 4 లక్షల కోట్ల సంపద వస్తుంది, ఉపాది దొరుకుంది, రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. ఇల్లుకట్టుకునే వాళ్ళకు రూ.1,80,000 మంజూరు చేస్తే సబ్సిడీతో అందించే సిమెంట్, ఇసుక, కమ్మిల లో మరో  రూ. 70 వేలవరకు లబ్ది కలగనున్నదని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జగనన్న కాలనీలకు  సహకారం అందించి పూర్తిచేయాలని కోరారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Deputy Chief Minister Narayana Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *