శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేసిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవేంద్ర ఫడ్నవీస్
శ్రీకాళహస్తీ ముచ్చట్లు:
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవేంద్ర ఫడ్నవీస్, వీరికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈవో కేవీ సాగర్ బాబు దక్షిణ గాలిగోపురం వద్ద స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద శేష వస్త్రంతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని,తీర్థప్రసాదాలను అందచేశారు .ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమారుడు ఆకాష్ రెడ్డి, దేవస్థానం పాలక మండలి సభ్యులు రమాప్రభ ప్రత్యేక ఆహ్వాన సభ్యులు చింతామణి పాండు, జూలకంటి సుబ్బారావు, దేవస్థానం అధికారులు ఏఈఓ ధనపాల్, సతీష్ మాలిక్, సూపర్డెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, వేద పండితులు బాలు శర్మ, రాకేష్ శర్మ, పట్టణ ప్రముఖులు కొండూరు నంద, వెంకటసుబ్బయ్య, గిరి ప్రసాద్ గౌడ్, తేజ, సుధీర్ మరియు దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Deputy Chief Minister of Maharashtra, Devendra Fadnavis visited the shrine of Sri Kalahasthishwara Swamy.

