డిప్యూటీ డైరెక్టర్ గుర్రంకొండ పాఠశాల ఖేలో ఇండియా కేంద్రం తనిఖీ.

-స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

 

మదనపల్లి ముచ్చట్లు:

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (తెలుగు)లో కెలో ఇండియా ఫెన్సింగ్ కేంద్రంగా ఎంపిక కాబడినటువంటి సందర్భంగా కేంద్రాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్   హిమబిందు ఐ.ఏ.ఎస్.,.    సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి కత్తిసాము ( ఫెన్సింగ్) శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి వివిధ సూచనలు చేశారు అదేవిధంగా ఈ పాఠశాల విద్యార్థులు వారి ప్రతిభ అనుగుణంగా సాధించినటువంటి సర్టిఫికెట్స్ ను పరిశీలించి వారిని అభినందించి, ఈ క్రీడలలో ఇంకా మంచి పరిణతి సాధించి పై స్థాయికి చేరాలని వారిని ఆశీర్వదించారు . ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా చీఫ్ కోచ్ మహమ్మద్ గౌస్  మరియు ఫెన్సింగ్ కోచ్ రవీంద్ర పాఠశాల పి.డి. సి. రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ కేంద్రాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నదుకు పాఠశాల పీడిని మరియు ప్రధానోపాధ్యాయులు అహ్మద్ భాషా ని ఈ సందర్భంగా ఈమె అభినందించారు.

 

Tags: Deputy Director Gurramkonda School Khelo India Center Inspection.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *