ఉద్యోగినిపై దాడి..డిప్యూటీ మేనేజర్ అరెస్టు

Date:30/06/2020

నెల్లూరు  ముచ్చట్లు:

కరోనా కేసులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖానికి మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అయ్యింది. ఇదే విషయమై.. మాస్క్ పెట్టుకోవాలంటూ ఓ అధికారికి అక్కడ పనిచేస్తున్న మరో మహిళ ఉద్యోగి సూచించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ అధికారి మహిళ అని చూడకుండా కూడా ఆమెపై దాడికి దిగాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల్లూరు ఏపీ టూరిజం ఆఫీసులో ఈ ఘటన చోటు చేసుకుంది.అక్కడ పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావు ముఖానికి మాస్క్ లేకుండా కార్యాలయానికి వచ్చాడు. దీంతో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణి .. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని భాస్కర్ రావుకు సూచించింది. దీంతో సహనం కోల్పోయిన భాస్కర్ రావు.. దివ్యాంగురాలైన ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. మహిళ అని చూడకుండా ఆమెను ఇనుపరాడ్డుతో కొట్టాడు. పలువురు ఉద్యోగులు అడ్డుకున్నప్పటికీ .. అతడు వాళ్లను సైతం పక్కకు నెట్టేశాడు. అయితే భాస్కర్ రావుకు, ఉషారాణికి మధ్య గతంలో ఎలాంటి గొడవలు లేవు. దీనిపై స్పందించి పై అధికారులు విచారణకు ఆదేశించారు. కలెక్టర్ సైతం ఆరోజు కార్యాలయంలో ఏం జరిగిందన్న దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ ఘటన ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్ రావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

వైస్ జగన్మోహనరెడ్డి  చే అంబులెన్సు వాహనాలు ప్రారంభo

Tags: Deputy manager arrested for assaulting employee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *