Date:27/01/2021
హైదరాబాద్ ముచ్చట్లు:
తుకారంగేట్ రైల్వే గేటు వద్ద రోడ్డు వంతెన (ఆర్ యు బీ) నిర్మాణంతో దశాబ్దాలుగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. తుకారం గేట్ ఆర్యూబీ ప్రాజెక్ట్ పనులనుఅయన బుధవారం పరిశీలించారు. పనులు సాగుతున్న తీరుతెన్నులను గమనించారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరవాత పద్మారావు గౌడ్ చొరవతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టడం జరిగింది. రూ.29 కోట్ల ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్
పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లకు పై గా నిధులను ఇప్పటికే మంజూరు చేసింది. అదే విధంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సైతం ఇప్పటికే నిధులను మంజూరు చేయించినట్లు శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికలకోడ్ పూర్తైన వెంటనే అధికారులతో ఆర్యూబీ ప్రాజెక్ట్ పనులను సమీక్షించనున్నట్లు అయన పేర్కొన్నారు.
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం
Tags: Deputy Speaker who oversaw the work of RUB