జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబా దోషి

Dera Baba was convicted in a journalist murder case

Dera Baba was convicted in a journalist murder case

పంచకుల సీబీఐ న్యాయస్థానం సంచలన తీర్పు
Date:11/01/2019
పంచకుల ముచ్చట్లు:
జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ పంచకుల సీబీఐ న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. గుర్మీత్‌తో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జగ్దీప్‌ సింగ్‌ తీర్పునిచ్చారు. దోషులకు జనవరి 17న శిక్షలు ఖరారు చేయనున్నారు. 2002లో సిర్సాకు చెందిన జర్నలిస్టు రాంచందర్‌ ఛత్రపతిని హత్య చేసినందుకు గాను గుర్మీత్‌పై కేసు నమోదు అయ్యింది. తీర్పు నేపథ్యంలో పంచకుల, హరియాణా ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కేసు విచారణకు దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులు న్యాయస్థానానికి హాజరయ్యారు. కాగా గుర్మీత్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యాడు. ప్రస్తుతం గుర్మీత్‌ అత్యాచారం కేసులో 20ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
హరియాణాలోని రోహ్‌తక్‌ సునారియా జైల్లో ఖైదీగా ఉన్నాడు. అత్యాచార కేసు తీర్పు సమయంలో పంచకులలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకొని 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంచకులతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.డేరా ఆశ్రమంలో గుర్మీత్‌ చేస్తున్న ఆకృత్యాలను ‘పూరా సచ్’ వార్తాపత్రికకు చెందిన జర్నలిస్టు రాంచందర్‌ ఛత్రపతి వెలుగులోకి తీసుకొచ్చారు. ఆశ్రమానికి వచ్చిన మహిళలను లైంగికంగా వేధిస్తూ, వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నట్లు ఛత్రపతి వార్తలు రాసుకొచ్చాడు. దీంతో అక్టోబరు 24, 2002న ఛత్రపతిని ఆయన ఇంట్లోనే దారుణంగా కాల్చి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్మీత్‌తో పాటు ఆయన అనుచరులు కుల్దీప్‌సింగ్‌, నిర్మల్‌ సింగ్‌ ఉన్నారు. కృషన్‌లాల్‌కు చెందిన రివాల్వర్‌తో కుల్దీప్‌, నిర్మల్‌.. జర్నలిస్టును హత్య చేశారు. 2003లో వీరందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను 2006లో సీబీఐ చేతికి అప్పగించారు. అప్పటి నుంచి కొనసాగిన ఈ కేసు విచారణలో నేడు తుది తీర్పు వెలువడింది. ఈ కేసు విచారించిన న్యాయస్థానం గుర్మీత్‌తో పాటు కుల్దీప్‌, నిర్మల్‌, కృషన్‌ను దోషులుగా తేల్చింది.
Tags:Dera Baba was convicted in a journalist murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *