పట్టాలు తప్పిన రైలు ఇంజన్

కర్నూలు ముచ్చట్లు:

 

కర్నూలులోని దేవనగర్ వద్ద రైలింజన్ పట్టాలు తప్పింది. కాచిగూడ నుంచి డోన్కు వెళ్తుండగా కర్నూలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఇంజన్ ముందుభాగాన ఉన్న రెండు చక్రాలు పట్టాలు కిందకు దిగాయి. వెంటనే పైలట్ ఇంజన్ను నిలిపివేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఇంజనీరింగ్ బృందం అక్కడికి చేరుకుంది. హైదరాబాద్ డివిజన్ నుంచి నిజనిర్ధారణ కమిటీ ద్వారా ప్రమాదానికి దారితీసిన అంశాలను పరిశీలించి రైల్వేశాఖకు నివేదిక సమర్పించినట్లు అధికారులు తెలిపారు. కర్నూలులో రైలింజన్ పట్టాలు తప్పడంతో తెలంగాణలోని గద్వాల రైల్వేస్టేషన్ వద్ద ఎగ్మోర్- గుంటూరు ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Derailed train engine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *