Natyam ad

పుంగనూరులో రైతుల విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం డీఈ కార్యాలయం – మంత్రి పెద్దిరెడ్డి

– ఇక రైతుల సమస్యలు ఇక్కడే పరిష్కారం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

విద్యుత్‌ సమస్యలపై పుంగనూరు నియోజకవర్గంలోని రైతులు మూడు సబ్‌డివిజన్‌ ప్రాంతాలకు వె ళ్లేవారని , రైతులకు వ్యయప్రయాసలు లేకుండ చేసేందుకు పుంగనూరులో సబ్‌డివిజన్‌ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలో సబ్‌డివిజన్‌ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని సీఎండి సంతోష్‌రావు, ఎస్‌ఈ కృష్ణారెడ్డి ఏర్పాటు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి , ఎమ్మెల్సీ భరత్‌, టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌తో కలసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి డివిజన్‌ కార్యాలయాన్ని మంజూరు చేశారని కొనియాడారు. డివిజన్‌ కార్యాలయంలో విద్యుత్‌ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో తిరుపతి, మదనపల్లె సబ్‌ డివిజన్‌ల పరిధిలో ఉన్న మండలాలను విభజించడం జరిగిందన్నారు. పుంగనూరుకు పలమనేరు, సదుం, సబ్‌డివిజన్‌ పరిధిలోని మండలాలతో పాటు పుంగనూరు రూరల్‌ మండలాలను చేర్చడం జరిగిందన్నారు. ఇకపై ఏ సమస్య ఎదురైనా సబ్‌ డివిజన్‌ అధికారులు అందుబాటులో ఉంటు రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీజిఎం ఆపరేషన్‌ చలపతి, ఈఈ విజయన్‌, డీఈలు రాజశేఖర్‌రెడ్డి, రెడ్డెప్ప, పద్మనాభపిళ్ళె, హరి, సురేష్‌బాబు, ఏడిలు రవి , చిన్నప్ప, శ్రీనివాసమూర్తి, బీమేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

19 సబ్‌ స్టేషన్లు…

నియోజకవర్గంలోని ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండ ఉండేందుకు 19 సబ్‌స్టేషన్లు 33/11 కెవి సామార్థ్యం గలవి నిర్మిస్తున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అలాగే సబ్‌ డివిజన్‌ కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న పాత భవనాలను తొలగించి, నూతన భవనాలు నిర్మించేందుకు రూ.4 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే రైతుల ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం స్థానికంగా మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తూ అన్ని విధాల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

 

Tags: DE’s office to solve farmers’ electricity problems in Punganur – Minister Peddireddy

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.