పుంగనూరులో వైఎస్సార్సీపీలో చేరిన దేశం కార్యకర్తలు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని భీమగానిపల్లె పంచాయతీ రాంపల్లెలో నివాసం ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌లు కలసి దేశం నాయకులు శ్రీనివాసులు, గౌరమ్మ, హరి, చక్రవర్తి, మంగమ్మ, మోహన్, రూప, మంజుల, గంగులమ్మ, చరణ్, శ్రీరామ్ లకు కండువాలు వేసి పార్టీలోకి చేర్చుకున్నారు. నాగభూషణం మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో డిపాజిట్లుకూడ రావన్నారు. జిమ్ముక్కులను ప్రజలు నమ్మరన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, అమ్ము, నరసింహులు, రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags; Desam activists joined YSRCP in Punganur
