కోరుట్ల నుంచి కల్వకుంట్ల వారసుడు

కరీంనగర్ ముచ్చట్లు:

తెలంగాణలో వారసత్వ రాజకీయాలు పెరిగాయి…ఇప్పటికే పలువురు నేతల వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు..ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి మరికొందరు వారసులు కూడా రెడీ అవుతున్నారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వారసుడు సంజయ్ సైతం వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో విద్యాసాగర్ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు.1997లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన విద్యాసాగర్…1998లో మెట్ పల్లి ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. 2001లో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగా గెలుపొంది..టీడీపీ పక్ష నాయకుడుగా పనిచేశారు. 2002 నుంచి మూడేళ్ళ పాటు కరీంనగర్ ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ గా పనిచేశారు. ఇక 2004లో ఈయనకు టికెట్ దక్కలేదు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో 2008లో విద్యాసాగర్ టీడీపీని వదిలి…టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కోరుట్లలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

 

 

ఇక 2010 ఉపఎన్నికలో సైతం విద్యాసాగర్ భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014, 2018 ఎన్నికల్లో సైతం విద్యాసాగర్ భారీ విజయాలు అందుకున్నారు. ఇలా వరుసగా విజయాలు సాధిస్తూ సత్తా చాటుతున్న విద్యాసాగర్…వచ్చే ఎన్నికల్లో తన వారసుడుని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే సంజయ్..కోరుట్ల నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు.అయితే కాస్త వయసు మీద పడుతుండటంతో..విద్యాసాగర్ నెక్స్ట్ ఎన్నికల బరి నుంచి తప్పుకుని, తనయుడుని నిలబెట్టాలని చూస్తున్నారు. ఇక కేటీఆర్ తో సంజయ్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి…పైగా ఇటీవల కోరుట్ల వచ్చిన కేటీఆర్…పదే పదే సంజయ్ పేరు ప్రస్తావించారు. ఈ పరిస్తితి బట్టి చూస్తుంటే నెక్స్ట్ ఎన్నికల్లో కల్వకుంట్ల వారసుడు కోరుట్లలో పోటీ చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది.  అలాగే కోరుట్లలో టీఆర్ఎస్ బలంగానే ఉంది…అలాగే ఎమ్మెల్యే విద్యాసాగర్ పై పెద్దగా నెగిటివ్ కనబడటం లేదు…ఈ నేపథ్యంలో నెక్స్ట్ కల్వకుంట్ల వారసుడు గెలుపుకు కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు.

 

Tags: Descendant of Kalvakuntla from Korutla

Leave A Reply

Your email address will not be published.