Natyam ad

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా దేశ్ పాండే ప్రమాణ స్వీకారం

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన   రఘునాథ్ విశ్వనాథ్ దేశ్ పాండే సోమవారం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో  వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు  లోకనాథం,   గోవిందరాజన్, ఓఎస్డీ  రామకృష్ణ, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Desh Pandey sworn in as members of TTD Board of Trustees

Post Midle