Natyam ad

బోట్లు ధ్వంసం

బాపట్ల ముచ్చట్లు:

 


బాపట్ల జిల్లా  చీరాల లో  మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసాయి.మండలంలోని వాడరేవు లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తో గంగపుత్రులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.తుఫాను బాపట్ల చీరాల మధ్య తీరం దాటడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.తీరం దాటిన సమయంలో అలలు ఎగసిపడి 10 మీటర్ల మేర సముద్రం ముందుకు రావడంతో ఒడ్డున నిలుపుకున్న రెండు బోట్లు వలలు ధ్వంసం కాగా మరో ఎనిమిది బోట్లు కనపడకుండా పోయాయని మత్య్సకారులు ఆవేదన చెందుతున్నారు.దీనితో లక్షల్లో నష్టం వాటిల్లిందంని వారు చెబుతున్నారు.ఇదిలా ఉంటే తీరప్రాంతంలో ని మత్య్సకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు వారికి భోజన సదుపాయం కూడా కల్పించలేదని  వారు వాపోతున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి తుఫాను కారణంగా నష్ట పోయిన మత్స్యకారులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Post Midle