క్రైస్తవ విగ్రహాలు ధ్వంసం

Date:23/09/2020

కాకినాడ ముచ్చట్లు

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో క్రైస్తవ విగ్రహాల ధ్వంసం కలకలం రేపాయి. మతాలకు అతీతంగా సోదరభావం తో కలిసి మెలిసి జీవించే పట్టణంలో ఆకతాయిల చర్యలు విస్తుకలిగిస్తున్నాయి. ఇటీవల రథం ఆలయం ఆవరణలో శ్రీ అభయాంజనే స్వామి వారి విగ్రహం వద్ద గల హుండీ పగులగొట్టిన సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. పెద్ద కాల్వ సమీపంలోని చర్చి వద్ద క్రైస్తవుల విగ్రహాలు ధ్వంసానికి గురికావడం కలవరం రేపుతోంది.  ఈ వరస సంఘటన లు ఎటువంటి పరిణామాల కు దారి తిస్తుందో అంతు చిక్కడం లేదు.ఇలాంటి సమయాల్లో సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు పేర్కొన్నారు.మండపేట ఆర్.సీ.ఎం చర్చ్ వద్ద గుర్తు తెలియని దుండగులు క్రీస్తు, మరియమ్మ విగ్రహాలను మంగళవారం అర్ధరాత్రి ద్వంసం చేశారు.  ఇటీవల హిందు దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎవరో కావాలనే ప్రతీకారెచ్చతో ఇది చేసినట్లు తెలుస్తోంది.

 

విషయం తెలుసుకున్న రామచంద్రపురం డీఎస్పీ బాల చంద్ర రెడ్డి, పట్టణ సీఐ అడపా నాగ మురళీలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.  కాగా దీనిపై పిర్యాదు చేసేందుకు చర్చ్ ఫాదర్ ముందుకు రాలేదు. మత కలహాలు తమకు ఇష్టం లేదని, భారం దేవునిపైనే వేస్తామని ఫాదర్ చెబుతున్నారు.బాధితులు పిర్యాదు చేయనప్పటికి   ఇవి ఉద్రిక్తతలకు దారి తీయకూడదనే ఉద్దేశ్యం తో పోలీస్  లు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆఘమేఘాలపై విగ్రహాలను మరమ్మతులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.  దుండగులను గుర్తించేందుకు సమీపంలోని షాపుల సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. కాగా దుండగులు ఘటన స్థలం వద్దే సుత్తి వదిలివేయడంతో క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఎటువంటి కలహాలు దారి తీస్తాయోనన్న ఆందోళన  సర్వత్రా నెలకొంది.

ఏసీబీవలలో వీర్వో 

Tags:Destroyed Christian idols

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *