Natyam ad

మైలవరాన్ని నాశనం చేసారు-మాజీ మంత్రి దేవినేని

మైలవరం ముచ్చట్లు:


బూడిదతో ఊపిరి ఆడటం లేదు.. కొండ జారింది!  లారీలతో బూడిద ఎలా తీసుకెళ్తున్నారు ? ఇసుక తోడేళ్ల లాగా తవ్వేస్తున్నారు బూడిద బూచోళ్ళు !  కోట్లు కుమ్మేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఆరోపించారు.   సర్పంచులు,  అనుచరులు.. ఎవరికి బంధువులు ?  అక్రమాలు నిజమే ..విజిలెన్స్ రిపోర్టులు వీటికి ఏం సమాధానం చెబుతావు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ? తిట్టేస్తే.. బోకరిస్తే అయిపోతుందా ?   విజిలెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ జరిగింది షాబాద్, జక్కంపూడి కొండలు తోవ్వేసింది ఎవరు?  సెంటు పట్టా పేరు మీద  ఉపాధి హామీ పనుల కింద పనులు చేసింది ఎవరు? అటవీశాఖ అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారు? మళ్లీ వాళ్లకు పోస్టింగులు ఎందుకు వచ్చాయి? ఎవరి వాహనాలు సీజ్ చేశారు ? పది లక్షల రూపాయలు పెనాల్టీ కట్టింది ఎవరని ప్రశ్నించారు.

 

 

 

ఇబ్రహీంపట్నం కాలనీలో ఏ గ్రావెల్ మట్టి పోశారు ? అసలు ఉపాధి హామీ పనులు ఎక్కడెక్కడ జరిగాయో మీడియాకు ఇవ్వు ?  బుడమేరు ముంపులో ఇళ్ల పట్టాలు !  రైల్వే ట్రాక్ ల దగ్గర ఇళ్ల పట్టాలు ! కొండపల్లి గ్రావెల్ మట్టి ఎక్కడికి పోయింది? వీటీపీఎస్ బూడిద ఎన్ని కోట్లు.. ఎవరికి తోలారని అయన అడిగారు.
లారీల వాళ్లు ఒకళ్ళు.. బూడిదతోలేది ఒకళ్ళు..! వీటిని రింగ్ చేసేది నీ బావమరిది ! బయట ప్రాంతాల నుంచి వచ్చిన మంత్రులవి ఎంపీలవి ఎన్ని లారీలు..?  నువ్వు అసమర్థుడివి ఎమ్మెల్యేగా పనిచేయడానికి ఒక్క నిమిషం కూడా నువ్వు అర్హుడివి కాదు. తప్పుకుంటున్నా.. పారిపోతునాను అని చెప్పి ఆరు నెలలు గ్రామాలు ఆడావు !
నువ్వేమో బిల్లులు సాధించుకోవాలని డ్రామాలాడుతున్నావు.  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దేవినేని ఉమాని సాధించాలని నిన్న అడ్డం పెట్టుకొని డ్రామాలాడుతున్నాడు.  మీ ఇద్దరి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు  ! మైలవరాన్ని నాశనం చేశారు. కొండపల్లి అడవిని కొట్టేశారు పునికి చెట్లను పడేశారు. పబ్బతివాని కపిలవాయి సత్రం లో రెండు తాడిచెట్ల లోతు గ్రావెల్ తోవ్వేశారు నువ్వు వెల్లంపల్లి తోడుదొంగలయ్యారని అన్నారు.

 

 

Post Midle

నన్ను జైల్లో పెట్టి తిట్టేసి రెండు మూడు టీవీల్లో మాట్లాడితే మీ పైశాచిక ఆనందం తీరిందా?  మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయి ఆగర్బ శ్రీమంతుడివి ఈ విధంగా దోచుకుంటావా ? మైలవరంలో చరిత్రలో ఎవరైనా ఈ విధంగా చేశారా ? ఎంతమంది మహానుభావులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేశారు వెల్లంకి విశ్వేశ్వరరావు, నిమ్మగడ్డ సత్యనారాయణ,  చనుమోలు వెంకట్రావు, వడ్డే శోభనాద్రిశ్వర రావు గారి మీద ఆరోపణలు చేశారా ? కోమటి జయరాం గారు స్థానాల్లో పార్టీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు ఇదంతా ఒక చరిత్ర. ఇదేం కర్మ మా మైలవరానికి! పొద్దున్నే ఇళ్ళ వెంట తిరిగి స్టిక్కర్లు అంటిస్తే సరిపోతుందా ? నిన్న వెలగలేరులో మా టీడీపీ నాయకులు తొడగొట్టి చెప్పారు.. ఏ ట్యాంకులెక్కి దూకుతావో.. ఏం రాజీనామాలు చేస్తావో ప్రజలకు సమాధానం చెప్పలని దేవినేని నిలదీసారు.

 

Tags:Destroyed Mylavaram – Ex-minister Devineni

Post Midle