సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం
పోలీసులు కాల్పులు
హైదరాబాద్ ముచ్చట్లు:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని యువకులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున యువకులు రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించి రాళ్లతో రైలుపై దాడి చేస్తూ నానా హంగామా సృష్టించారు. పార్సల్ బ్యాగులను పట్టాలపై వేసి ధ్వంసం చేసారు. రైలు అద్దాలను రాళ్లు రువ్వి పగులకొట్టారు. ఫ్లాట్ ఫామ్లపై వస్తువులకు నిప్పటించారు. మూడు రైళ్లకు నిప్పటించారు నిరసనకారులు. అలాగే 20 బైక్ లను కూడా తగులబెట్టారు. దీంతో రైల్వే స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు యువకులు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. నిరసరకారులు తరువాత స్టేషన్ బయలకు వచ్చి అక్కడ ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. అద్దాలను ధ్వంసం చేశారు.

Tags: Destruction at Secunderabad Railway Station
